- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్! టీమ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: 31 నుంచి ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ సిద్ధమవుతోంది. మరో ఎనమిది రోజుల్లో మొదలు కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదా బరిలోకి దిగనున్నది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే జరుగనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్ టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తులో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో విక్రమ్ సోలంకి మాట్లాడుతూ.. ‘శుభ్‌మన్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు.
తొలి సీజన్ లో అతడు చాలా బాధ్యతలు తీసుకున్నాడని, వృత్తి పట్ల అతడికున్న నిబద్ధత కూడా గిల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే విధంగా ఉన్నాయన్నాడు. గిల్ సమీప భవిష్యత్తులో గుజరాత్ కు సారథిగా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడని, గిల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్ అని కొనియాడాడు.