మరోసారి నోరుపారేసుకున్న ఇంజమామ్, సలీమ్ మాలిక్

by Hajipasha |
మరోసారి నోరుపారేసుకున్న ఇంజమామ్, సలీమ్ మాలిక్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచ కప్ సెమీస్‌కు టీమిండియా చేరడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మరోసారి నోరు పారేసుకున్నారు. టీమిండియా విజయానికి బాల్ ట్యాంపరింగ్ కారణమని ఆరోపించారు. భారత జట్టులోని కీలక బౌలర్లలో ఒకడైన హర్షదీప్ సింగ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో బాల్ ట్యాంపరింగ్ చేశాడని పాక్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్, మరో మాజీ ప్లేయర్ సలీమ్ మాలిక్ ఆరోపించారు.

ఓ టీవీ షోలో పాల్గొన్న పాక్ మాజీ క్రికెటర్లు హర్షదీప్ బౌలింగ్‌పై అనుమానం వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 16వ ఓవర్లో హర్షదీప్ వేసిన బంతి ఎలా రివర్స్ స్వింగ్ అయ్యిందని వారు ప్రశ్నించారు. 12 లేదా 13 ఓవర్లలోనే బంతి రివర్స్ స్వింగ్ కావడం ప్రారంభమయ్యి ఉండాలి. అంపైర్లు కళ్లు తెరిచి బౌలర్లపై దృష్టి పెట్టాలని ఇంజమామ్, సలీమ్ హితవు పలికారు. ఐసీసీ కూడా కొన్ని జట్ల విషయంలో కళ్లు మూసుకుని ఉంటుందని టీమిండియాను ఉద్దేశించి పాక్ మాజీ క్రికెటర్ సలీమ్ మాలిక్ ఆరోపించారు. ఇదిలాఉండగా,టీ20 ప్రపంచకప్ సూపర్ -8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత బౌలర్ హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed