Breaking: వైసీపీ కార్యాలయం కూల్చివేత.... ఉద్రిక్తత

by srinivas |
Breaking: వైసీపీ కార్యాలయం కూల్చివేత.... ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కట్టాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పర్మిషన్ లేకుండా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపైనా ఆరా తీసింది. దీంతో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏ ఒక్క వైసీపీ కార్యాలయానికి కూడా అనుమతులు లేనట్టుగా తేలింది. దీంతో అన్ని కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం తూర్పుగోదావారి జిల్లా కడియంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడియంలో అక్రమంగా నిర్వహించిన వైసీపీ కార్యాలయాన్ని గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు జేసీబీలతో వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు వైసీపీ నేత గిరిజాల బాబు ప్రయత్నంచేశారు. రైతు బజార్ నిర్మాణానికి సంబంధించి షెడ్డు నిర్మించామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వైసీపీ నేత గిరిజాలబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కడియం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. గిరిజాలబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ నేతలపై కక్ష సాధింపులకు దిగిందని, తమ కార్యాలయాలను ఉద్దేశపూర్వకంగానే కూల్చివేస్తోందని ఆరోపించారు

Next Story

Most Viewed