- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jasprit Bumrah : బుమ్రాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బౌలర్ బుమ్రాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసలతో ముంచెత్తాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ మొదటి రోజు ఆటలో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను వణికించాడు. అద్భుతమైన స్పెల్ వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ సందర్భంగా బుమ్రా ఆటతీరుపై స్పందించిన అక్రమ్ మాట్లాడుతూ.. అన్ని ఫార్మాట్‌లలో బుమ్రా బెస్ట్ బౌలర్. స్వింగ్, పేస్, కంట్రోల్, క్రీజును బుమ్రా వినియోగించే విధానం చూడటానికి కన్నులపండువగా ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బలహీనతను వెంటనే తెలుసుకుని అందుకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. సారధిగా తన జట్టును ముందుండి నడిపాడు.’ అని అక్రమ్ అన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 67 పరుగులు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్లలో తొలి సారి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ 37 పరుగులు చేసి రాణించాడు.