డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడు వద్దు.. కేఎల్ రాహుల్‌ను తీసుకోండి : సునీల్ గవాస్కర్

by Vinod kumar |
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడు వద్దు.. కేఎల్ రాహుల్‌ను తీసుకోండి : సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తుది జట్టులో ఎవరు ఉండాలన్నే విషయంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. బోర్డర గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను పక్కన పెట్టాలని, అతని స్థానంలో కేఎల్ రాహుల్ కే కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. అయితే కేహెల్ రాహుల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక తుది జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భరత్ బ్యాట్‌తో నిరాశపరిచిన విషయం తెలిసిందే.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో ఇండియా చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్‌కు వెళ్లింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టైటిల్ కోసం తలపడనుంది. అయితే కేఎల్ రాహుల్‌కు ఇంగ్లండ్‌లో మంచి రికార్డు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేశాడు. "కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా తీసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడు ఐదు లేదా ఆరోస్థానంలో బ్యాటింగ్ చేస్తే బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. గతేడాది రాహుల్ ఇంగ్లండ్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. లార్డ్స్‌లో సెంచరీ కూడా చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తుది జట్టును ఎంపిక చేసే సమయంలో రాహుల్‌ను గుర్తు పెట్టుకోండి" అని గవాస్కర్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed