సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ లెజెండ్ కీలక సలహా..

by Vinod kumar |
సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ లెజెండ్ కీలక సలహా..
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా మూడు గోల్డెన్ డక్స్ ఔటై.. విమర్శలను ఎదుర్కోంటున్న టీమ్ ఇండియా యువ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌కు భారత మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చాడు. ఆసీస్ వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్‌లో చెలరేగాలని సూచించాడు. కెరీర్‌లో ప్రతీ ప్లేయర్‌కి విఫలమవ్వడం సాధారణమని.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. పరుగులపై ఫోకస్ పెట్టాలన్నారు. అలా చేస్తే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని సూచించాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌటైన విషయం తెలిసిందే.

తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే తరహాలో ఎల్బీగా వెనుదిరిగిన సూర్య.. చివరి వన్డేలో స్పిన్నర్ అష్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సూర్యకు బదులు ఇతర ఆటగాడికి అవకాశమిచ్చినా జట్టుకు కలిసొచ్చేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శించారు.

'సూర్యకుమార్ యాదవ్ మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అవడం బాధాకరమే. కానీ అతను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ ఆటగాడి కెరీర్‌లో అయినా జరిగేదే. ఈ వైఫల్యం గురించి ఎంత త్వరగా మరిచిపోతే అంత ఉత్తమం. మూడు గోల్డెన్ డకౌట్స్ గురించి మరిచిపోయి అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ మీద సూర్య దృష్టిపెట్టాలి. ఐపీఎల్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి తద్వారా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి' అని అభిప్రాయపడ్డారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకు అండగా నిలిచాడు. ఈ సిరీస్‌లో సూర్య మూడు బంతులే ఆడటం దురదృష్టకరమని, మూడు అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు. వరుసగా గోల్డెన్ డకౌట్‌లు అయినంత మాత్రానా అతని సామర్థ్యం, నైపుణ్యాలు ఎక్కడికీ పోవని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed