ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ డౌన్

by Harish |
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ డౌన్
X

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ పడిపోయింది. ఫిఫా గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగు స్థానాలు కోల్పోయి 121 ర్యాంక్‌కు దిగజారింది. గత నెలలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో భారత్ తన ర్యాంక్‌ను కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో 2-1తో పరాజయం పాలైంది. గతేడాది టాప్-100లోకి ప్రవేశించిన భారత్.. ఏషియన్ కప్‌, వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో దారుణ ప్రదర్శనతో ర్యాంక్‌నూ కోల్పోతూ వస్తోంది. గత నెలలో ఏకంగా 15 స్థానాలు నష్టపోగా.. తాజాగా 4 స్థానాలు కోల్పోయి 121కు పడిపోయింది. ఇటీవల కాలంలో భారత్‌కు చెత్త ర్యాంక్ ఇదే. అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, బ్రెజిల్ టాప్-5లో నిలిచాయి. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జూన్ 6న కువైట్‌తో, జూన్ 11న ఖతార్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed