Virat Kohli: జిమ్‌లో విరాట్ ​కసరత్తులు.. ‘లెగ్ డే’ పై ఆసక్తికర పోస్ట్.. అసలు 'లెగ్​డే' అంటే ఏంటి..?

by Vinod kumar |
Virat Kohli: జిమ్‌లో విరాట్ ​కసరత్తులు.. ‘లెగ్ డే’ పై ఆసక్తికర పోస్ట్.. అసలు లెగ్​డే అంటే ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌పై బాగా ఫోకస్ పెట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. ఈ టీమిండియా స్టార్ సుమారు ఏడెనిమిదేళ్లుగా అలాగే ఉన్నాడు. వయసు పెరిగింది, గడ్డం కొంత తెల్లబడిందేకానీ.. ఫిట్‌నెస్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్ కోసం కరీబియన్ దీవులకు చేరుకున్న అతను.. అక్కడ కూడా తన డైలీ వర్కవుట్‌లు చేస్తూనే ఉన్నాడు.

విండీస్‌ పర్యటనకు వెళ్లిన విరాట్.. తన ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించట్లేదు. అక్కడ కూడా తన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్​ చేస్తునే.. జిమ్‌లో కసరత్తలు చేస్తూ కనిపించాడు. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. "ప్రతి రోజు 'లెగ్‌డే'. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది" అంటూ ఓ క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. తన జిమ్​కోచ్‌తో కలిసి కాళ్లను బలోపేతం చేసే పలు వ్యాయామాలను చేశాడు. దీంతో నెటిజన్లు అసలు 'లెగ్‌ డే' అంటే ఏంటి అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

అసలు ఈ లెగ్‌ వర్కౌట్లు ఏంటంటే..?

స్పోర్ట్స్ ఆడే వారిలో కాళ్లు చాలా బలంగా ఉండాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ చేసే సమయంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం, బౌలింగ్‌ కోసం రనప్‌ చేయడం లాంటివి చేస్తుంటారు. అటువంటి సమయంలో తమ కాళ్లు చురుగ్గా స్పందించాలంటే మరి తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. వీటన్నింటినీ కోచ్‌ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. అయితే బరువులను మోయడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల పిక్కలు బలంగా మారతాయి. ఇవి గాయాల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుందని.

బరువు పెంచుకుంటూ..

లెగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను విభిన్న రకాలుగా చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్​ సమయంలో క్రమంగా బరువు, రెప్స్‌, సెట్స్‌ను పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఏదైనా సవాళ్లు ఎదురైతే.. అవి మరింత బలపడతాయి. మీరు ఒక నిర్దిష్టమైన బరువును మూడు సెట్లలో 12 రెప్స్‌ చేస్తూ.. ఉన్నారని అనుకుంటే. అది కాస్త ఈజీగానే ఉంటుంది. కానీ అదే ప్రతి సెట్‌కు బరువును ఓ పదిశాతం పెంచుకుంటూ పోతే ఇక కండరాలకు సవాలుగా అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు బలోపేతంగా మారతాయి.

Advertisement

Next Story

Most Viewed