ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టీ20 వర్షార్పణం.. సిరీస్ పంచుకున్న ఇరు జట్లు

by Harish |
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టీ20 వర్షార్పణం.. సిరీస్ పంచుకున్న ఇరు జట్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మూడో టీ20 వర్షార్పణమైంది. మాంచెస్టర్‌లో మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వర్షం పడింది. మధ్య మధ్యలో ఆగినా మళ్లీ కురిసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ సమయం తుడిచిపెట్టుకుపోయింది. చివరికి రెండు ఇన్నింగ్స్‌లను ఐదు ఓవర్లు చొప్పున నిర్వహించాలని చూసినా సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్టు ప్రకటించారు. తొలి మ్యాచ్‌లో ఆసిస్ నెగ్గగా.. రెండో టీ20లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక, నిర్ణయాత్మక మూడో టీ20 రద్దవడంతో టీ20 సిరీస్‌ను 1-1తో ఇరు జట్లు పంచుకున్నాయి. సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(124 రన్స్, 5 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు ఈ నెల 19న తొలి వన్డే ఆడనున్నాయి.

Advertisement

Next Story