తిరిగి వెళ్లిపోయిన ఇంగ్లాండ్ టీమ్.. కారణం ఏంటంటే?

by Harish |
తిరిగి వెళ్లిపోయిన ఇంగ్లాండ్ టీమ్.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌పై 106 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ టీమ్ భారత్‌‌ను వీడింది. అయితే, ఆ జట్టు స్వదేశానికి కాకుండా అబుదాబికి వెళ్లింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అబుదాబికి ఎందుకు వెళ్లిందన్న చర్చ జరుగుతుంది.

ఇంగ్లాండ్ జట్టు అబుదాబికి వెళ్లడానికి కారణముంది. టీమ్ ఇండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆ జట్టు అబుదాబిలోనే కండీషనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. అక్కడ భారత్‌తో పోరుకు సన్నద్ధమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. అలాగే, భారత స్పిన్నర్ల ఎదుర్కోవడంపై ప్రాక్టీస్ చేసింది. అయితే, వైజాగ్ టెస్టు ఒక్క రోజు ముందుగానే ముగియడంతో మూడో టెస్టు ప్రారంభానికి 10 రోజుల సమయం ఉంది. తిరిగి పుంజుకునేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లాండ్ టీమ్ భావిస్తున్నది. కీలకమైన మూడో టెస్టుకు ముందు విశ్రాంతితోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే తిరిగి అబుదాబి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ మూడో టెస్టు కోసం సన్నద్ధంకానుంది.

దీనిపై ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ మాట్లాడుతూ..‘ఇండియాలో ఉంటే హోటల్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అబుదాబిలో అయితే బయటకు వెళ్లొచ్చు. భారత్‌లో మేము ప్రాక్టీస్ చేస్తే నెట్స్‌లో మాకు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ చేయరు. 15 ఏళ్ల స్పిన్నర్‌తో మేము ప్రాక్టీస్ చేయాలి. అది మమ్మల్ని టెస్టు మ్యాచ్‌కు సిద్ధం చేయదు.’అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed