స్వర్ణం సాధించడమే లక్ష్యం : పారాలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి జీవాంజి

by Harish |
స్వర్ణం సాధించడమే లక్ష్యం : పారాలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి జీవాంజి
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం దీప్తితోపాటు పలువురు పారా అథ్లెట్లు, కోచ్‌లు స్వదేశానికి చేరుకున్నారు. వారిని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ..తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించిన దీప్తికి అభినందనలు తెలిపారు. దీప్తి జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ.. దేశానికి పతకం గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సారి కాంస్య పతకం సాధించానని, వచ్చేసారి కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని దీమా వ్యక్తం చేసింది. సన్మాన కార్యక్రమంలో దీప్తితోపాటు ఇతర పారా అథ్లెట్లు రవి రొంగలి(పురుషుల షాట్‌పుట్ ఎఫ్40), రక్షిత రాజు(మహిళల 1500 మీటర్ల టీ11), కంచన్ లఖానీ(మహిళల డిస్కస్ త్రో ఎఫ్‌53), సాక్షి కసానా(మహిళల డిస్కస్ త్రో ఎఫ్55), మను(పురుషుల షాట్‌పుట్ ఎఫ్37), కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed