Duleep Trophy 2023: దుమ్మురేపిన పుజారా.. దులీప్​ ట్రోఫీలో 'సూపర్'​ సెంచరీ..

by Vinod kumar |
Duleep Trophy 2023: దుమ్మురేపిన పుజారా.. దులీప్​ ట్రోఫీలో సూపర్​ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: దులీప్ ట్రోఫీ - 2023లో వెస్ట్​ జోన్ తరఫున ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా శతకంతో కదం తొక్కాడు. ఫస్ట్​ క్లాస్​ కెరీర్​లో 60వ సెంచరీని నమోదు చేశాడు. దులీప్ ట్రోఫీ 2023లో సెంట్రల్​ జోన్​తో జరుగుతున్న మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో పుజారా.. వంద పరుగుల మార్క్​ను దాటాడు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో పుజారా ప్రస్తుతం.. 132 పరుగులతో (14 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.

కాగా మూడో రోజు లంచ్​ తర్వాత ఆట సాగుతుండగా.. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ 291/8 తో ఉంది. అయితే విండీస్ పర్యటనకు టీమ్ఇండియా టెస్టు జట్టులో పుజారాకు టీమ్ఇండియా సెలెక్టర్లు మొండి చేయి చూపారు.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్​లో​ వెస్ట్ జోన్ 220 పరుగులకే కుప్పకూలింది. సెంట్రల్ జోన్ బౌలర్​ శివమ్‌ మావి (6/43) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన.. సెంట్రల్ జోన్​లో ధృవ్ జోరెల్ (46 ), రింకూ సింగ్ (48) మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా సెంట్రల్​ జోన్ జట్టు 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వెస్ట్ జోన్ బౌలర్లలో నాగస్వల్లా 5 వికెట్లు నేల కూల్చాడు.

Advertisement

Next Story

Most Viewed