- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajit Agarkar : కొత్త చీఫ్ సెలెక్టర్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా
దిశ, వెబ్‌డెస్క్ : భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈయనకు ఇచ్చే వేతనం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గతంలో పని చేసిన వారికంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. బీసీసీఐ ఎంపిక చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అగార్కర్ పేరును మంగళవారం ప్రతిపాదించగా అతడినే ఖరారు చేసింది. ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడినందున ఆ సీనియారిటీ ప్రకారమే అజిత్ అగార్కర్ పేరును రిఫర్ చేసినట్లు వెల్లడించింది. వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ తర్వాతి పరిణామాల నడుమ ఈ ఫిబ్రవరిలో చేతన్ శర్మ తప్పుకోగా అతడి స్థానంలో ఇప్పుడు అగార్కర్‌ను సెలక్ట్ చేశారు.
అయితే సెలక్టర్ల ఛైర్మన్‌కు అంతకుముందు ఇచ్చిన దాని కంటే చాలా పెద్ద మొత్తంలో అగార్కర్‌కు బీసీసీఐ జీతం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చేతన్ శర్మ సహా అంతకుముందు చీఫ్ సెలక్టర్లకు కూడా వార్షిక వేతనం కింద రూ. కోటి వేతనం ఇచ్చారు. సెలక్షన్ కమిటీలోని మిగతా సభ్యులకు రూ. 90 లక్షల చొప్పున ఇస్తోంది. ఇప్పుడు అగార్కర్‌కు చేతన్ శర్మతో పోలిస్తే వార్షిక వేతనం 200 శాతం పెంచినట్లు తెలుస్తోంది. అంటే అగార్కర్‌కు ఇప్పుడు బీసీసీఐ సంవత్సరానికి రూ. 3 కోట్లు వేతనంగా ఇవ్వనుంది. బీసీసీఐ ఆయనకు రూ. 3 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అగార్కర్ మొత్తం భారత జట్టు తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ-20 లు ఆడాడు.
1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్ అగార్కర్. తన పేరిట ఒక టెస్టు సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్‌గా కూడా ఈయనకు పేరుంది. 2000 సంవత్సరంలో జింబాబ్వేపై 21 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఇంత ప్రతిభావంతుడు కాబట్టే ఆయనకు చీఫ్ సెలెక్టర్ గౌరవం దక్కింది. అయినా గతంలో పని చేసిన వారికంటే అంత పెద్ద మొత్తంతో వేతనం ఇవ్వడం ఏమిటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అసలు ఈ విషయం నిజమేనా, లేక మీడియాల్లో వస్తున్న ప్రచారమా అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.