- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్
దిశ, స్పోర్ట్స్ : టీ20ల్లో మాజీ నం.1 బ్యాటర్, ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 37 ఏళ్ల మలన్ బుధవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘2017 జూలై నుంచి అద్భుతమైన ప్రయాణం. మూడు ఫార్మాట్లలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకావం దక్కింది. అందరూ ఇంకో మ్యాచ్ ఆడలేదని, ఇంకొన్ని పరుగులు చేయాల్సిందని పశ్చాత్తాపపడతారు. కానీ, నా కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నా. ఈ ప్రయాణంలో ఒత్తిడి, మానసిక, శారీరక నష్టాన్ని కలిగించినా.. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాధించిన దాని పట్ల గర్వంగా ఉంది.’ అని చెప్పాడు.
కాగా, 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మలన్ 7 ఏళ్ల కెరీర్‌లో ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 4, 416 రన్స్ చేశాడు. భారత గడ్డపై గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు.
- Tags
- #Dawid Malan