CWC Qualifiers 2023: నెదర్లాండ్స్‌ను గెలిపించిన ఆంధ్ర క్రికెటర్‌..

by Vinod kumar |
CWC Qualifiers 2023: నెదర్లాండ్స్‌ను గెలిపించిన ఆంధ్ర క్రికెటర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో.. ఆంధ్ర క్రికెటర్‌ తేజ నిడమనురు (విజయవాడ) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (60 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు) పరుగులతో రాణించారు. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. తేజ, కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ జట్టును గెలిపించారు. యూఎస్‌ఏ బౌలర్లలో జస్‌దీప్‌ సింగ్‌ 2, సౌరభ్‌ నేత్రావాల్కర్‌, అలీ ఖాన్‌, నోష్‌తుష్‌ కెంజిగే తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 రన్స్ మాత్రమే చేసింది. షాయాన్‌ జహంగీర్‌ (71) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్‌ సింగ్‌ (33), జెస్సీ సింగ్‌ (38) పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ర్యాన్‌ క్లీన్‌, బాస్‌ డి లీడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌, క్లేటన్‌ ఫ్లాయిడ్‌, విక్రమ్‌జిత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisement

Next Story

Most Viewed