- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శాఫ్ టోర్నీ ఫైనల్‌లో కాంట్రవర్సీ.. టైటిల్‌ను పంచుకున్న భారత్, బంగ్లా జట్లు
దిశ, స్పోర్ట్స్ : శాఫ్ అండర్-19 ఉమెన్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్, బంగ్లాదేశ్ పంచుకున్నాయి. ఆఖర్లో వివాదం చెలరేగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. ఢాకా వేదికగా గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 8వ నిమిషంలోనే సిబాని దేవి గోల్ చేయడంతో భారత్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. అలాగే, బంగ్లాను గోల్ చేయకుండా అడ్డుకోవడంతో ఫస్టాఫ్‌లో 1-0తో నిలిచింది. భారత్ మరో గోల్ చేయలేకపోయినా చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే, మరి కాసేపట్లే మ్యాచ్ ముగుస్తుందనగా ఆఖరి నిమిషంలో బంగ్లా ఏకైక గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా.. అక్కడ కూడా ఇరు జట్లు 11-11తో సమవుజ్జీలుగా నిలిచాయి.
దీంతో టాస్ ద్వారా విజేతను తేల్చగా.. మ్యాచ్ కమిషనర్ భారత్‌ను విన్నర్‌గా ప్రకటించాడు. దీంతో భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. మరోవైపు, టాస్‌కు అంగీకరించిన బంగ్లా జట్టు ప్రతికూల ఫలితం రావడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, బంగ్లా అభిమానులు కూడా నిరసన తెలిపారు. మైదానంలోకి వాటిర్ బాటిళ్లను విసిరారు. దీంతో గందరగోళం ఏర్పడింది. దాదాపు రెండు గంటల నిరీక్షణ తర్వాత మ్యాచ్ కమిషనర్ తన నిర్ణయం మార్చుకుని భారత్, బంగ్లా జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాడు. ఈ నిర్ణయం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో మహిళల శాఫ్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగొవ ఏజ్ గ్రూపు టైటిల్. అలాగే, బంగ్లాదేశ్ గడ్డపై మొదటిది.