Breaking : చిక్కుల్లో శ్రీలంక క్రికెటర్..!

by Maddikunta Saikiran |
Breaking : చిక్కుల్లో శ్రీలంక క్రికెటర్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీ‌లంక జట్టుకి ఊహించ‌ని షాక్ తగిలింది. ఆ దేశ క్రికెట‌ర్ ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌ చిక్కుల్లో ప‌డ్డాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాడు.మూడేళ్ళ క్రితం జ‌రిగిన శ్రీలంక ప్రీమియ‌ర్ లీగ్‌లో ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణలు ఉన్నాయి. ఈ విషయంపై అవినీతి నిరోధ‌క శాఖ‌కు త‌క్ష‌ణ‌మే సమాధానం చెప్పాలని ప్ర‌వీణ్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ICC) ఆదేశించింది.కానీ లంక స్పిన్న‌ర్ మాత్రం ICC ఇచ్చిన గడువులోగా తన సమాధానం చెప్పలేదు. పైగా త‌న ఫోన్‌లోని కొన్ని మేసేజ్‌ల‌ను ప్ర‌వీణ్ డిలీట్ చేశాడు . దీంతో ఐసీసీ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకొని అత‌డికి అల్టిమేటం జారీ చేసింది. కానీ, ఐసీసీ ఆదేశాల‌ను ప్ర‌వీణ్ పట్టించుకోలేదు . ఐసిసి అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు ప్రవీణ్ జయవిక్రమపై మూడు అభియోగాలు నమోదయ్యాయి.

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ప్ర‌వీణ్ శ్రీలంక తరుపున 2021లో అరంగేట్రం చేశాడు. కాగా.. అరంగేట్ర మ్యాచులోనే టెస్టుల్లో 10 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ప్ర‌వీణ్ రికార్డు నెల‌కొల్పాడు.అతను శ్రీలంక తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 15 మ్యాచులు ఆడాడు. ప్ర‌వీణ్ చివరిగా 2022 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన T20I మ్యాచ్ లో ఆడాడు . అయితే.. ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌ శ్రీలంక తరుపున కేవలం ఒకే సంవత్సరం బ‌రిలోకి దిగాడు.

Next Story

Most Viewed