Heavy Rain: నగరంలో కుండపోత వర్షం.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్

by Shiva |
Heavy Rain: నగరంలో కుండపోత వర్షం.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతు పవనాల(Southwest monsoon winds) తిరోగమనం ఎఫెక్ట్‌తో హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని ప్రధాన రహదారులు వర్షం నీటితో జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ (Traffic Jam) అవ్వడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ముఖ్యంగా ఉప్పల్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, కంటోన్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడలో హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌ కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్‌, అల్వాల్‌, హకీంపేట్‌, చార్మినార్‌లో పాంత్రాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) బాన్సువాడ, నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసాలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF)సిబ్బందిని రంగంలోకి దింపారు.

Next Story

Most Viewed