- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atishi : అత్యధికంగా 13 మంత్రిత్వ శాఖలు సీఎం అతిషి వద్దే..
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ నూతన సీఎంగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మంత్రులుగా గోపాల్ రాయ్, కైలావ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. శాఖల వారీగా చూస్తే.. అత్యధికంగా 13 మంత్రిత్వ శాఖలు సీఎం అతిషి వద్దే ఉండటం గమనార్హం. గతంలో కేజ్రీవాల్ హయాంలోనూ అత్యధిక మంత్రిత్వ శాఖలు అతిషి వద్దే ఉండేవి. ఇప్పుడు కూడా వాటిని అతిషి తన వద్దే ఉంచుకున్నారు. ఆమె వద్ద ఉన్న మంత్రిత్వ శాఖల జాబితాలో విద్య, రెవెన్యూ, ఆర్థికం, విద్యుత్, ప్రజా పనుల విభాగం ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ వద్ద ఏ శాఖ కూడా లేదు.
అతిషి తర్వాత అత్యధికంగా 8 శాఖలు మంత్రి సౌరభ్ భరద్వాజ్ వద్ద ఉన్నాయి. ఆయనకు ఆరోగ్యం, పట్టణ వికాసం, ఇరిగేషన్, టూరిజం వంటి కీలక శాఖలను అతిషి అప్పగించారు. మంత్రి ముకేశ్ అహ్లావత్‌కు కార్మిక, గురుద్వారా ఎన్నికలు, ఎస్సీ,ఎస్టీ సంక్షేమం, భూములు-భవనాల శాఖలను కేటాయించారు. మంత్రి గోపాల్ రాయ్‌కు ఢిల్లీ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పర్యావరణం, అటవీ శాఖలను అప్పగించారు. గతంలో కేజ్రీవాల్ హయాంలోనూ ఆయన వద్ద ఇవే శాఖలు ఉండేవి. మంత్రి కైలాశ్ గహ్లోత్‌కు హోం, రవాణా, పాలనా సంస్కరణలు, మహిళా శిశు సంక్షేమ శాఖలు కేటాయించారు. మంత్రి ఇమ్రాన్ హుస్సేన్‌కు మునుపటిలాగే పౌరసరఫరాల విభాగం, ఎన్నికల విభాగం అప్పగించారు.