- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాగుల మొలకలతో వెజ్ ఊతప్పం .. సింపుల్ రెసిపీనే గానీ రుచి అదిరిపోతుంది!
దిశ, వెబ్‌డెస్క్: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో మెగ్నీషియం దట్టంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో షుగర్ లెవర్స్ కంట్రోల్‌లో ఉంటాయి. చాలా మంది ఆరోగ్యానికి మంచిదని రాగి జావ తాగుతారు. గంజి, జావ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ దరిచేరకుండా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ రాగుల పొడిని అన్నంలో కలిపి తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్ విటమిన్లు , ప్రొటీన్లు, ఫైబర్‌లు, తగినంత క్యాలరీలు ఉంటాయి. అలాగే ఉపయోగకరమైన అసంతృప్త కొవ్వులు ఉంటాయి. రాగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ రాగిజావ తాగితే మంచి ఆరోగ్యంతో పాటు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.
అయితే మొలకెత్తించిన రాగులతో ఊతప్పం తయారు చేసుకుని తింటే.. రుచి అదిరిపోతుంది. ఎప్పుడు రొటిన్‌గానే కాకుండా రాగులతో కొత్తగా ఊతప్పం రెడీ చేయండి. కూరగాయలతో చేసే ఊతప్పం తింటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి.
రాగి ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు..
2 చెంచాల పెరుగు, 2 చెంచాల బియ్యం పిండి, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 కప్పు రాగులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టమాటా,తగినంత ఉప్పు తీసుకోవాలి.
తయారీ విధానం..
ఫస్ట్ రాగులను వాటర్‌లో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నీళ్లలో రాగులను 5 గంటలు నానబెట్టి.. ఏదైనా గుడ్డలో వీటిని ఉంచాలి. ఆరేడు గంటల్లో రాగులు మొలకెత్తుతాయి. ఇప్పుడు మొలకొచ్చిన రాగుల్ని, పచ్చిమిర్చి, పెరుగు మిక్స్ పట్టాలి. అందులో బియ్యం పిండి కలిపి 5 గంటలు పులియబెట్టాలి. తర్వాత గ్యాస్‌పై పెనం పెట్టి నూనె వేయాలి. గరిటతో పిండిని దోసలాగా పలుచగా కాకుండా కాస్త మందంగా వేసుకోవాలి. వాటిమీద ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు వేయాలి. ఆయిల్‌కు బదులు బటర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఊతప్పాన్ని రెండు వైపులా కాల్చితే రంగు మారిపోయి.. రుచి అదిరిపోతుంది. దీన్ని సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే మళ్లీ మళ్లీ ఊతప్పం చేసుకోవాలనిపిస్తుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.