- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KL Rahul : ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. టీంఇండియాకు బిగ్ రిలీఫ్
దిశ, స్పోర్ట్స్ : వాకా స్టేడియంలో ఆదివారం జరిగిన ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగడంతో టీం ఇండియాకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గంట పాటు రాహుల్ బ్యాటింగ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాటింగ్ సమయంలోనూ రాహుల్ ఎలాంటి ఇబ్బంది పడలేదని తెలుస్తోంది. మ్యాచ్ తొలి రోజు గాయం కారణంగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి రాహుల్ మోచేతికి తాకడంతో రాహుల్‌కు గాయమైంది. ఫిజియో సూచనల మేరకు రాహుల్ గ్రౌండ్‌ను వీడాడు. ఇదే ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్లిప్‌లో క్యాచ్ అందుకుంటుండగా గిల్ బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. దీంతో గిల్ తొలి టెస్ట్ ఆడటం లేదు. నవంబర్ 15న రోహిత్ దంపతులకు బాబు పుట్టడంతో హిట్ మ్యాన్ సైతం పెర్త్ టెస్ట్‌కు అందుబాటులో ఉండునున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌లు భారత్‌కు టాప్ ఆర్డర్‌లో ఆప్షన్లుగా ఉన్నారు.