- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పఠాన్' పాటకు మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. షారూఖ్ ఖాన్ ఆసక్తికర కామెంట్(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్ సినిమాలోని జూమే జో పఠాన్.. పాట దేశవ్యాప్తంగా షారూఖ్ అభిమానులతో పాటు డ్యాన్స్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. సెలెబ్రెటీల నుంచి సామాన్యుల దాకా జూమే జో పఠాన్ అంటూ స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ పాటకు సరదాగా డ్యాన్స్ చేశాడు. నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
మైదానంలో నిలుచున్న కోహ్లీ.. పక్కనే ఉన్న రవీంద్ర జడేజా సరదాగా పఠాన్ పాటకు స్టెప్పులేశారు. ప్రేక్షకులలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాలలోనే వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై షారుఖ్ ఖాన్ స్పందించారు. వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేశాడు. 'కోహ్లీ, జడేజా లు తనకంటే బాగా డ్యాన్స్ చేశారని.. వారి నుంచి తనే నేర్చుకోవాలంటూ' షారూఖ్ ఖాన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?