బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చించే అవకాశం

by Vinod kumar |
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చించే అవకాశం
X

న్యూఢిల్లీ : వచ్చే నెల జూలై 7వ తేదీన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీసీఐ మీడియా హక్కులపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. డిస్నీ స్టార్‌తో మార్చిలోనే మీడియా రైట్స్ ఒప్పందం ముగిసింది. బీసీసీఐ సెక్రెటరీ బుధవారం మాట్లాడుతూ.. త్వరలోనే టెండర్ రిలీజ్ చేస్తామని, ఆగస్టు చివరి నాటికి మీడియా హక్కుల ప్రక్రియను ముగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో 2023-28కి సంబంధించిన మీడియా రైట్స్‌ గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ మీడియా రైట్స్ లాగే.. బీసీసీఐ మీడియా హక్కులను కూడా టీవీ, డిజిటల్ హక్కులుగా వేర్వేరుగా అమ్మాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వచ్చే నాలుగు ఏళ్లలో సొంతగడ్డపై 20 టెస్టులు, 21 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీడియా రైట్స్ నుంచి రూ. 12 వేల కోట్లు ఆర్జించాలని బోర్డు అనుకుంటున్నది. అలాగే, ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్‌కు భారత జట్లను పంపించడంపై ఈ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన వేదికలను టోర్నీ నాటికి సిద్ధం చేయడంపై కూడా చర్చించనున్నారు. అవసరమైన స్టేడియాల్లో మౌళిక వసతులను మెరుగుపర్చడంతోపాటు పలు స్టేడియాలను అప్‌గ్రేడ్ చేయడంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed