IPL 2024: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ రేంజ్ పెరగడం ఖాయం!

by Vinod kumar |
IPL 2024: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ రేంజ్ పెరగడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ రేంజ్ పెంచేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్‌ మజా కూడా మరో స్థాయికి చేరడం ఖాయమని నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు పెట్టే మొత్తాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపింది. గతేడాది మినీ వేలానికి ముందు కూడా ఫ్రాంచైజీల పర్సు వాల్యూను బీసీసీఐ పెంచిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఫ్రాంచైజీల పర్సు వాల్యూను రూ.100 కోట్లకు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. వచ్చే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ కూడా కొత్త పర్సు విలువతోనే వేలం బరిలో దిగుతాయని తెలుస్తోంది. ఆయా జట్లు ఎంతమంది కావాలంటే అంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఈసారి ఉంటుందట. ఇలా ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా మిగిలిన ఆటగాళ్లకు మాత్రమే వేలం నిర్వహిస్తారని సమాచారం. అలాగే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వేలం నిర్వహించే తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. వీటిలోనే ఒక నగరంలో వేలం నిర్వహిస్తారు. గతేడాది కోచి నగరంలో ఐపీఎల్ మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేలంలో పది ఫ్రాంచైజీలు కలిపి రూ.167 కోట్లు ఖర్చు చేసి 80 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed