BCCI New Rules: క్రికెట్‌లో కొత్త రూల్‌.. బీసీసీఐ కీలక ప్రకటన..!

by Vinod kumar |
BCCI New Rules: క్రికెట్‌లో కొత్త రూల్‌.. బీసీసీఐ కీలక ప్రకటన..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ‌వాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఇక‌పై ఒక్కో ఓవ‌ర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. స‌య్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి ఈ కొత్త రూల్స్ అమ‌లులోకి రానున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌కు మధ్య పోటీని బ్యాలెన్స్‌ చేసేందుకు ఈ రూల్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ రూల్‌తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్‌ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధన స‌క్సెస్ కావ‌డంతో ఆ రూల్‌ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్స్‌ స‌క్సెస్ అయితే మిగిలిన దేశ‌వాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్‌ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్‌లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌల‌ర్ల ప్రభావం పెరిగే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 స‌య్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ 6 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Advertisement

Next Story

Most Viewed