బంగ్లా కెప్టెన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి

by Vinod kumar |   ( Updated:2023-07-07 13:12:17.0  )
బంగ్లా కెప్టెన్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ యూటర్న్ తీసుకున్నాడు. ప్రధాని షేక్ హసీనా సూచన మేరకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధానితో భేటీ అయిన అతడు.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. కాగా, ఇటీవల అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాతా తమీమ్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తమీమ్ ఇక్బాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో కెరీర్ ప్రారంభించిన అతడు మూడు ఫార్మాట్లలో 15వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లో (యాక్టివ్ క్రికెటర్లు) వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు తమీమే. విరాట్ కోహ్లీ (12,898), రోహిత్ శర్మ (9,825) తర్వాత మూడో స్థానంలో తమీమ్ ఇక్బాల్ (8,313) ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed