పారిస్ పారాలింపిక్స్ పతక విజేతలకు నజరానా.. రూ. 50 లక్షలు ప్రకటించిన BAI

by Harish |
పారిస్ పారాలింపిక్స్ పతక విజేతలకు నజరానా.. రూ. 50 లక్షలు ప్రకటించిన BAI
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) మంగళవారం క్యాష్ రివార్డు ప్రకటించింది. మెడల్స్ గెలిచిన ఐదుగురికి కలిపి మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. పారిస్ పారాలింపిక్స్‌లో పారా షట్లర్లు అదగొట్టారు. స్వర్ణంతోసహా ఐదు పతకాలు అందించారు. పురుషుల సింగిల్స్‌లో నితీశ్ కుమార్(ఎస్‌ఎల్3) స్వర్ణం సాధించగా.. సుహాస్ యతిరాజ్(ఎస్‌ఎల్4) రజతం గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో తులసిమతి మురుగేసన్(ఎస్‌యూ5) సిల్వర్ మెడల్, మనీషా రామదాస్(ఎస్‌యూ5), నిత్యశ్రీ శివన్(ఎస్‌హెచ్6) బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

మొత్తం రూ. 50 లక్షల్లో గోల్డ్ మెడలిస్ట్ నితీశ్‌కు రూ. 15 లక్షలు, సిల్వర్ మెడలిస్ట్‌లు సుహాస్ యతిరాజ్, తులసిమతిలకు రూ. 10 లక్షల చొప్పున అందనున్నాయి. ఇక, కాంస్య పతక విజేతలు మనీషా, నిత్యశ్రీలకు చెరో రూ. 7.5 లక్షలు దక్కుతాయి. ‘పారాలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించడంలో వారు చేసిన సహాయాన్ని గుర్తించడంలో నగదు బహుమతి ఒక మార్గం. పారా బ్యాడ్మింటన్‌ను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి, ప్లేయర్లు మరిన్ని విజయాలు సాధించడంలో సహాయం చేయడానికి బీఏఐ కట్టుబడి ఉంది.’ అని బీఏఐ జనరల్ సెక్రెటరీ సంజయ్ మిశ్రా తెలిపారు. కాగా, పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా షట్లర్లు రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed