Badminton Asia Junior Championships 2023: భారత్ యువ షట్లర్లు శుభారంభం..

by Vinod kumar |
Badminton Asia Junior Championships 2023: భారత్ యువ షట్లర్లు శుభారంభం..
X

జకార్తా : ఇండోనేషియాలో శుక్రవారం ప్రారంభమైన బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు శుభారంభం చేశారు. ఈ టోర్నీలో గ్రూపు-సిలో భాగమైన భారత్ తొలి గ్రూపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. ముందుగా మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సమర్‌వీర్-రాధిక శర్మ జోడీ 21-12, 21-10 తేడాతో నజ్ముల్ ఇస్లామ్-స్మృతి రాజ్బోంగ్షి‌పై గెలిచి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించింది. ఆ తర్వాత మెన్స్ సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 21-5, 21-9 తేడాతో సిఫాత్ ఉల్లాహ్‌పై నెగ్గి ఆధిక్యాన్ని పెంచగా.. ఉమెన్స్ సింగిల్స్‌లో తారా షా 21-2, 21-7 తేడాతో స్మృతి రాజ్బోంగ్షిని ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది.

అనంతరం మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్‌ మ్యాచ్‌ల్లోనూ భారత యువ షట్లర్లు సత్తాచాటి బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్ చేశారు. మెన్స్ డబుల్స్‌లో నికోలస్ రాజ్-తుషార్ సువీర్ 21-13, 21-12 తేడాతో నజ్ముల్ ఇస్లామ్-సిఫాత్ ఉల్లాహ్‌పై, ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా సింగ్-కర్ణిక 21-8, 21-15 తేడాతో జెస్మిన్-మథెనా మాధుర్జ్యో బిస్వాస్‌ గెలుపొందారు. మిగతా రెండు గ్రూపు మ్యాచ్‌లు నేడు జరగనున్నాయి. మొదట హాంకాంగ్‌తో, ఆ తర్వాత మలేషియాతో భారత్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed