India Vs Pakistan మ్యాచ్‌పై Shoaib Akhtar సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2022-08-29 14:43:43.0  )
India Vs Pakistan  మ్యాచ్‌పై Shoaib Akhtar  సంచలన వ్యాఖ్యలు
X

ఇస్లామాబాద్: భారత్-పాక్ జట్లు ఓడిపోవడానికే మ్యాచులు ఆడాయని, క్రికెట్‌కు ఇది బ్యాడ్ డే అని పాక్ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోమవారం తన యూట్యూబ్ ఛానెల్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ.. 'భారత్, పాక్ జట్లకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇరు జట్టు మ్యాచ్ ఓడిపోవడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. భారత్ ఓడిపోవడానికి సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ హార్దిక్ పాండ్యా అడ్డుగా నిలిచాడు. మీరే చెప్పండి. రిజ్వాన్‌ 42 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మొదటి ఆరు ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. ఎక్కువ డాట్ బాల్స్ ఆడితే.. జట్టు ఇబ్బందుల్లో పడినట్లే. అలాగే ఇద్దరు కెప్టెన్లు తమ జట్టు ఎంపికను సరిగ్గా చేయలేదు. రిషబ్‌పంత్‌ను భారత్ పక్కన పెడితే.. పాక్ మాత్రం ఇఫ్తికార్ అహ్మద్‌ను నాలుగో స్థానంలో పంపింది. బాబర్‌ను ఓపెనింగ్‌లోకి వెళ్లొద్దని చాలా సార్లు చెప్పాను. అయినా మాట వినలేదు. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదనిపించింది. భారత్ కూడా అదే తప్పును చేసింది. అందుకే ఇది క్రికెట్‌కు బ్యాడ్ డే. ఇరు జట్లు దారుణంగా మ్యాచులు ఆడినట్లు అనిపింది.' అని పేర్కొన్నాడు.

Advertisement

Next Story