Babar Azam: వైరల్‌గా మారిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ షూ.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్‌

by Vinod kumar |
Babar Azam: వైరల్‌గా మారిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ షూ.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్థాన్ జట్టు తొలి పోరులో న్యూజిలాండ్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ షూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కివీస్‌తో పోరులో బాబర్ కుడి షూపై ‘వింక్’ ఎమోజీ దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు.. దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. కెమెరా పనితనం గొప్పగా ఉందని ఒకరు అంటే.. అచ్చం మ్యాచ్‌లో బాబర్‌ను చూసినట్లే ఉంది ఈ ఎమోజీ అని మరొకరు స్పందించారు.

తొలి వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో కదంతొక్కారు. కివీస్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed