- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫైనల్‌కు సబలెంక, క్విన్వెన్.. అదరగొట్టిన బోపన్న జోడీ
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ చాంపియన్ టైటిల్ పోటీదారులెవరో తేలిపోయింది. డిఫెండింగ్ చాంపియన్, 2వ సీడ్ సబలెంక(బెలారస్) మరోసారి టైటిల్ పోరుకు చేరుకుంది. ఇక, చైనా క్రీడాకారిణి జెంగ్ క్విన్వెన్ ఓ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారిగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. గురువారం జరిగిన సెమీస్‌లో సబలెంక 7-6(7-2), 6-4 తేడాతో అమెరికా సంచలనం, 4వ సీడ్ కోకా గాఫ్‌ను చిత్తు చేసింది. గంటా 42 నిమిషాలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కోకా గాఫ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఏ మాత్రం పట్టువదలని సబలెంక వరుస సెట్లలోనే ఆటను ముగించింది. టోర్నీలో మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా గెలుచుకుంటూ వస్తున్న సబలెంక.. వరుసగా ఐదు మ్యాచ్‌ను కూడా రెండు సెట్లలోనే ముగించింది. 8 డబుల్ ఫౌల్ట్స్, 20 అనవసర తప్పిదాలతో గాఫ్ మూల్యం చెల్లించుకుంది. దీంతో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న గాఫ్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. మరోవైపు, చైనా క్రీడాకారిణి, 12వ సీడ్ క్విన్వెన్ తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో క్విన్వెన్ 6-4, 6-4 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి డయానా యాస్ట్రెమస్కాను మట్టికరిపించింది. వీళ్లద్దరి మధ్య కూడా పోరు ఆసక్తికరంగానే సాగింది. తొలి సెట్‌లో 6 గేముల్లో ఇద్దరు చెరోసారి పరస్పరం సర్వీస్‌లను బ్రేక్ చేసుకోవడంతో 3-3తో నిలిచారు. అయితే, 7వ గేమ్‌లో క్విన్వెన్ మరోసారి ప్రత్యర్థి బ్రేక్ పాయింట్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లోనూ పోరు ఇలాగే సాగింది. 7వ గేమ్‌లో బ్రేక్ పాయింట్ పొందడంతో లీడ్‌లోకి వెళ్లిన క్విన్వెన్ అదే జోరులో 10వ గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకుని మ్యాచ్‌ను ముగించింది. దీంతో తొలిసారిగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన క్విన్వెన్.. శనివారం డిఫెండింగ్ చాంపియన్‌తో సబలెంకతో తాడోపేడో తేల్చుకోనుంది.
ఫైనల్‌కు బోపన్న జోడీ
పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జోడీ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటలకుపైగా హోరాహోరీగా సాగిన సెమీస్‌లో థామస్ మాచాక్(చెక్ రిపబ్లిక్)-జాంగ్ జిషెన్(చైనా) జోడీపై 3-6, 6-3, 6-7(7-10) తేడాతో బోపన్న ద్వయం విజయం సాధించింది. మూడో సెట్‌ను సూపర్ టైబ్రేకర్‌లో నెగ్గడంతో బోపన్న జోడీని విజయం వరించింది. దీంతో అతిపెద్ద వయసులో ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన ఆటగాడిగా బోపన్న రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న జోడీ.. ఇటలీకి చెందిన సిమోనె బొలెల్లి-ఆండ్రే వవాస్సోరి జోడీతో తలపడనుంది.