- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే గెలిపించలేకపోయా : Sanju Samson
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. సంజూ శాంసన్(63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 50 రన్స్) మెప్పించినా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఓటమికి కారణం ఓ రెండు షాట్లు ఆడకపోవడం అని సంజూ శాంసన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సంజూ శాంసన్.. టాప్ ఆర్డర్ నెమ్మదిగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందా..? అనే ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆటలో తప్పిదాలు చేయడం కామన్ అని.. నేను కూడా కొన్ని తప్పిదాలు చేశాను. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవ్వాల్సిందే అని సంజూ బదులిచ్చాడు. ఫైనల్ ఓవర్‌లో భారత్ విజయానికి 30 పరుగులు అవసరం.. ఈ దశలో మూడో బంతి వరకూ శాంసన్ భారత్‌ను రేసులో ఉంచాడు. కానీ నాలుగో బంతిని కనెక్ట్ చేయలేకపోవడంతో మ్యాచ్ సౌతాఫ్రికా వైపు తిరిగింది. దీంతో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
FIFTY for @IamSanjuSamson 👏👏
— BCCI (@BCCI) October 6, 2022
The right-handed batter has kept the run chase alive with his clean striking! #TeamIndia need 59 off the final four overs.
Don't miss the LIVE coverage of the #INDvSA match on @starsportsindia pic.twitter.com/298jDemOit
- Tags
- Sanju Samson