Asian Games 2023: ఆల్‌టైమ్‌ రికార్డు.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్

by Vinod kumar |   ( Updated:2023-10-04 13:38:15.0  )
Asian Games 2023: ఆల్‌టైమ్‌ రికార్డు.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023లో భారత్ పతకాల హవా కొనసాగుతోంది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్‌ (ముహమ్మద్‌ అనాస్‌ యహియా, అమోజ్‌ జాకబ్‌, ముహమ్మద్‌ అజ్మల్‌, రాజేశ్‌ రమేశ్‌) 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్‌ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్‌, 31 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) చేరింది. ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్‌ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డు (18) సాధించింది.

మెన్స్‌ రిలే టీమ్‌ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్యను 81కి పెంచుకుంది. దీంతో పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్‌, 94 సిల్వర్‌, 51 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్‌ 147 మెడల్స్‌తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed