అఫ్రిదిని చూసి భయపడకండి: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్

by Hajipasha |   ( Updated:2022-08-10 11:44:52.0  )
అఫ్రిదిని చూసి భయపడకండి: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిదిని చూసి భయపడవద్దని సలహా ఇచ్చాడు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 28వ తేదీన ఉండనుంది. ఈ క్రమంలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు తనదైన రీతిలో భారత క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ సేనకు పలు సూచనలు అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. గతేడాది టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వికెట్లను అఫ్రిదినే తీశాడు.

ఈనెల 28న జరిగే మ్యాచ్‌లో పేసర్ అఫ్రిదిని చూసి టీమ్ ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, కోహ్లీ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అఫ్రిది బంతిని స్వింగ్ చేస్తున్నాడా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. అఫ్రిది బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతాడో వేచి చూడాలి. ఆసియా కప్ దినేష్ కార్తీక్‌కు చాలా కీలకం కానుంది. ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో దినేష్ ముందుకు సాగుతున్నాడు. ఆసియా కప్‌లో భారత్ గెలిస్తేనే సెలక్టర్లు ఎంపిక చేయగలరు.' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మంచి ప్రతిభ కనబర్చారు.

Advertisement

Next Story

Most Viewed