- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులు అడిగారని ట్రాన్స్జెండర్లతో నృత్యాలు…పెళ్లి కుమారుడు తండ్రిపై కేసు
దిశ, బడంగ్ పేట్ : ఎంగేజ్మెంట్ సమయంలో డబ్బులు డిమాండ్ చేయడానికి వచ్చిన ట్రాన్స్జెండర్లతో డ్యాన్సులు చేయించిన పెళ్ళి కొడుకు తండ్రిపై బాలాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ... బాలాపూర్ ఆలీనగర్కు చెందిన ఆమీర్ కుమారుడిది ఆదివారం రాత్రి ఎంగేజ్మెంట్ చేసుకుంటుండగా ఒక్కసారిగా ట్రాన్స్జెండర్లు ఊడిపడ్డారు.పెళ్ళింటివారిని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో డ్యాన్సులు చేస్తే డబ్బులు ఇస్తామని పెళ్లి కొడుకు తండ్రి ఆమీర్ చెప్పాడు. దానికి అంగీకరించిన ట్రాన్స్జెండర్లు డబ్బుల కోసం అసభ్యకరంగా నృత్యాలు చేశారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి కుమారుడు తండ్రి అమీర్పై బాలాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.