Pak Vs Ban: కోహ్లి రికార్డ్ బ్రేక్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం..

by Vinod kumar |
Pak Vs Ban: కోహ్లి రికార్డ్ బ్రేక్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 2,000 పరుగుల మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.

పాక్‌ తరఫున 31 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మైలురాయిని అందుకున్న బాబర్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. కాగా వన్డేల్లో 2,000 పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లికి 36 ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయి. ఈ జాబితాలో వరుసగా 41, 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ సాధించిన బ్యాటర్లుగా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్‌, వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed