Asia Cup 2023: కేఎల్‌ రాహుల్‌ ఔట్.. పాక్‌తో కీలక మ్యాచ్‌.. తుది జట్టులో ఎవరు..?

by Vinod kumar |
Asia Cup 2023: కేఎల్‌ రాహుల్‌ ఔట్.. పాక్‌తో కీలక మ్యాచ్‌.. తుది జట్టులో ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ షాకింగ్ విషయం చెప్పాడు. ఈ టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆడటంపై అప్‌డేట్ ఇచ్చాడు. రాహుల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని చెప్పిన ద్రావిడ్.. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్‌ రాహుల్‌ ఆసియాకప్‌లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు (పాకిస్తాన్‌, నేపాల్‌) దూరమయ్యాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మ్యాచులు ఆడేందుకు రాహుల్ ఇంకా ఫిట్‌గా లేడని వెల్లడించాడు. పాకిస్తాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్ కోసం భారత్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రాహుల్ వంటి కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ జట్టుకు దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఐపీఎల్ సమయంలో గాయపడిన రాహుల్.. శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో పాక్‌, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో రాహుల్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పాక్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ రీప్లేస్‌మెంట్‌గా తుది జట్టులో ఎవరుంటారని భారత అభిమానులు చర్చించుకుంటున్నారు. రాహుల్‌ ఔటయ్యాక వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కోటాలో భారత్‌కు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇషాన్‌ కిషన్‌, ట్రావెలింగ్‌ రిజర్వ్‌ సంజూ శాంసన్‌లలో ఎవరో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీరిలో అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉంటాయన్న విషయాన్ని పరిశీలిస్తే.. రేసులో ఇషాన్‌ కిషన్‌ ముందుంటాడు. అయితే అతని స్థానంలో శాంసన్, కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో చేరిన శాంసన్‌కు ఈ టోర్నీలో అవకాశం దక్కడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్‌కే టీం మేనేజ్‌మెంట్ ఓటు వేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed