ఇటు భైరవకోన...అటు కపిల తీర్థం..ఏపీలో జలపాతాల దూకుడు

by Y. Venkata Narasimha Reddy |
ఇటు భైరవకోన...అటు కపిల తీర్థం..ఏపీలో జలపాతాల దూకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో జలపాతాల దూకుడు సాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు..వాగులు పొంగి పరవళ్ళు తొక్కుతున్నాయి. జలపాతాలు కోండాకోనల్లోని వరద నీటి దూకుడుతో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కారణంగా భైరవకోన జలపాతం ఉప్పొంగుతుంది. కొండ మీదుగా ఉదృత జలహోరుతో దిగువకు దూకుతున్న భైరవకోన జలపాతం సందర్శకులను కట్టిపడేస్తుంది. అటు తిరుమల కొండల్లో భారీ వర్షంతో కపిలతీర్థం జలపాతం, ఆకాశ గంగ జలపాతాలు జల సవ్వడుల సోయగాలతో సాక్షాత్ ఆ పరమ శివుడి జటాఝూటం నుంచి దివి నుంచి భువికి జాలువారుతున్న గంగమ్మను తలపిస్తు భక్తులను ఆకర్షిస్తున్నాయి.

తిరుమల కొండలపై నుంచి దిగువకు వస్తున్న జలపాతాలు పాల నురుగలను తలపిస్తు కనువిందు చేస్తున్నాయి. భక్తులు ఆయా జలపాతాల అందాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. తిరుపతి వరదయ్యపాలెం, కడూరు ప్రాంతాల్లో చిన్న వంతెనపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed