నీ భార్యను పంపించు అంటూ నోరు జారిన పృథ్వీ.. ఆగ్రహంతో ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్

by Kavitha |   ( Updated:2024-10-16 15:36:52.0  )
నీ భార్యను పంపించు అంటూ నోరు జారిన పృథ్వీ.. ఆగ్రహంతో ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి ఈ షోను చూడటానికి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏడో వారం ప్రారంభ‌మైంది. ఇక ఈ వారం గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, ప్రేరణ, హరితేజ.. ఇలా తొమ్మిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే మంగళవారంకు సంబంధించిన ఎపిసోడ్ ప్రొమోను విడుద‌ల చేశారు.

ఈ ప్రోమోలో.. పృథ్వీ ప్రోమో చూసి రెండు టాస్కుల్లోనే క‌న‌బ‌డ్డానంటూ నామినేష‌న్ చేశావు.. అది త‌న‌కు న‌చ్చలేద‌ని చెప్పి అవినాష్‌ను నామినేట్ చేస్తాడు. ఈ క్ర‌మంలో అవినాష్‌కు పృథ్వీకి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అప్పుడు అవినాష్.. నేను చూసిన ఏపీసోడ్స్‌లో రెండు టాస్కుల్లో తప్ప ఎక్కడా కనిపించలేదు అని మా వైఫ్ చెప్పింది. దాన్ని బట్టే నిన్ను నామినేట్ చేశా అని అంటాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లోకి మీ వైఫ్‌ను పంపించాల్సింది. మరి మీరెందుకు వ‌చ్చారు అని అవినాష్‌ను ఉద్దేశించి అన్నాడు.

దీంతో అవినాష్ సీరియ‌స్ అవుతూ వైఫ్ టాఫిక్ తీయ‌వ‌ద్దు అని చెప్పాడు. మరోసారి రా అంటూ పృథ్వీ నోరు జారాడు. రా అనకు అని అవినాష్ మండిపడ్డాడు. దీంతో పృథ్వీ మరింత రెచ్చిపోయాడు. బిగ్‌బాస్‌కు వచ్చావ్ కదా నేర్చుకో అంటూ అవినాష్ ఫైర్ అయ్యారు. ఇక్కడితో ఈ ప్రోమో అయిపోతుంది. మరి మీరు కూడా ఈ ప్రోమోను చూసేయండి.

(video link credits to disney+ hotstar telugu youtube channel)

Advertisement

Next Story