రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం

by Mahesh |   ( Updated:2024-10-16 08:32:46.0  )
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అయింది. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీకి కేంద్ర మంత్రివర్గం హాజరయ్యింది. కాగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వార్తలు.. వాటిని నిజం చేస్తూ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను మరో 3 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. దానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న ఉద్యోగుల డీఏ 53 కు చేరుకుంది. దీంతో పాటుగా 2025-2026 రబీ సీజన్ కు సంబంధించిన గోదుమ పంట పై కూడా మద్దతు ధరను పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గోధుమలకు క్వింటాలకు రూ. 150 ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా.. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలపై సాయంత్రం వరకు అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

Next Story

Most Viewed