Ashleigh Gardner: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌.. తొలి క్రికెటర్‌గా..

by Vinod kumar |
Ashleigh Gardner: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌.. తొలి క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ గెలుచుకుంది. ఈ అవార్డును వరుసగా రెండు నెలలు (జూన్‌, జులై) గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కావడం విశేషం. జులై నెలలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసిన ఆష్లే వరుసగా రెండో నెల కూడా ఐసీసీ అవార్డును గెలుచుకుంది. జులై నెలకు పురుషుల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ గెలుచుకున్నాడు. జులై నెలలో కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను వోక్స్‌కు ఈ అవార్డు దక్కింది.

Advertisement

Next Story

Most Viewed