Ashes 2nd Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్..

by Vinod kumar |
Ashes 2nd Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: యషెస్ సిరీస్‌‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ తెలిపాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన స్టోక్స్.. పిచ్ ఉన్న గ్రాస్‌ను ఉపయోగించుకొని తొలి సెషన్‌లోనే ఆశించిన ఫలితం రాబట్టాలనుకుంటున్నానమని చెప్పాడు. జట్టులోకి అదనపు పేసర్‌గా వచ్చిన జోష్ టంగ్.. మా బౌలింగ్‌కు వైవిధ్యాన్ని ఇస్తాడని ఆశిస్తున్నామని తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. జట్టు బౌలింగ్‌లో ఏకైక మార్పు చేశామని, స్కాట్ బోలాండ్‌ స్థానంలో మిచెల్ స్టార్క్‌ను తీసుకున్నామని చెప్పాడు. వరుసగా 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్న నాథన్ లయన్‌పై కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనిలాంటి ఆటగాడు జట్టులో ఉండటం కెప్టెన్‌గా తాను చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చాడు. వరుసగా 100 టెస్ట్‌లు ఆడటం అనేది ఆశామాషి వ్యవహరం కాదని కొనియాడాడు.

ఇంగ్లండ్:

జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో(కీపర్), స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్

ఆస్ట్రేలియా:

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, జోష్ హజెల్‌వుడ్.

Advertisement

Next Story