Ashes 2023: యాషెస్​లో మరో రికార్డు.. ఆ ఫీట్​ను దాటేసిన స్టీవ్​ స్మిత్​..

by Vinod kumar |
Ashes 2023: యాషెస్​లో మరో రికార్డు.. ఆ ఫీట్​ను దాటేసిన స్టీవ్​ స్మిత్​..
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్ వేదికగా లార్డ్స్​ స్టేడియంలో జరుగుతున్న యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆసీస్​ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​ మరో అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్​ క్రికెట్​లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యాషెస్​ సిరీస్​ రెండో టెస్ట్​లో 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఈ ఫీట్​ను స్మిత్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు భారత క్రికెట్​ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్​, భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్​ ద్రావిడ్‌ల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు.

ఈ మ్యాచ్​లో మరికొన్ని రికార్డులను కూడా నమోదు చేశాడు స్టీవ్​ స్మిత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో నాటౌట్​గా నిలిచిన స్మిత్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 41 మంది ప్లేయర్స్​ మాత్రమే ఈ మైలురాయిని చేరుకోగా.. వారిలో టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ 53.44 సగటుతో స్మిత్​ కంటే కాస్త మెరుగైన యావరేజ్​ రేట్​ను కలిగి ఉన్నాడు. కాగా, స్మిత్​ 49.67 సగటుతో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 9 వేల రన్స్​ చేసిన ఆటగాళ్లు వీరే..

కుమార సంగక్కర (శ్రీలంక)- 172 ఇన్నింగ్స్

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 174 ఇన్నింగ్స్

రాహుల్ ద్రావిడ్ (ఇండియా)- 176 ఇన్నింగ్స్​

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 177 ఇన్నింగ్స్​

బ్రయాన్‌ లారా (వెస్టిండీస్​)- 177 ఇన్నింగ్స్​

సచిన్ తెందూల్కర్ (ఇండియా)​- 179 ఇన్నింగ్స్​

Advertisement

Next Story

Most Viewed