Ashes 2023 : విజృంభించిన బౌల‌ర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆసీస్‌కు ఆధిక్యం

by Vinod kumar |
Ashes 2023 : విజృంభించిన బౌల‌ర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆసీస్‌కు ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 325 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో బెన్ డ‌కెట్ (98) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, హ్యారీ బ్రూక్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో జాక్ క్రాలీ(48), ఓలి పోప్‌(42) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, జో రూట్‌(10), బెన్ స్టోక్స్‌(17), బెయిర్ స్టో (16) లు విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో.. మిచెల్ స్టార్క్ 3, ట్రావిస్ హెడ్‌, జోష్ హేజిల్ వుడ్ చెరో 2, క‌మిన్స్‌, నాథ‌న్ లైయ‌న్‌, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. ఆసీస్‌కు కీల‌క‌మైన 91 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

Advertisement

Next Story

Most Viewed