Ashes 2023: ఆరు వికెట్లతో చెలరేగిన కమిన్స్‌.. ఇంగ్లండ్‌ ఆలౌట్‌..

by Vinod kumar |
Ashes 2023: ఆరు వికెట్లతో చెలరేగిన కమిన్స్‌.. ఇంగ్లండ్‌ ఆలౌట్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023లో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్టోక్స్‌ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు. పాట్‌ కమిన్స్‌ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ కాసేపటికే రూట్‌ వికెట్‌ కోల్పోగా.. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. క్రీజులో కుదురుకున్న స్టోక్స్‌ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు.

ఆ తర్వాత స్టోక్స్‌ ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన స్టోక్స్‌ ఆ తర్వాత కమిన్స్‌, స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. స్టోక్స్‌ మినహా మిగతా బ్యాటర్లలో మొయిన్‌ అలీ (21), మార్క్‌ వుడ్‌ (24), జాక్‌ క్రాలీ (33) పరుగులు చేశారు. కమిన్స్‌ ఆరు వికెట్లు తీయగా.. స్టార్క్‌ 2, టాడ్‌ మర్ఫీ, మిచెల్‌ మార్ష్‌ చెరొక వికెట్‌ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. మిచెల్‌ మార్ష్‌ సెంచరీతో రాణించాడు.

Advertisement

Next Story

Most Viewed