బజ్‌బాల్ ఒక్కటే కాదు.. ఇంత తెలివి కూడా ఉండాలి : Michael Vaughan

by Vinod kumar |
బజ్‌బాల్ ఒక్కటే కాదు.. ఇంత తెలివి కూడా ఉండాలి : Michael Vaughan
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో ఓటమి కొని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే బజ్‌‌బాల్ ఒక్కటే సరిపోదని.. స్మార్ట్‌నెస్ కూడా కావాలని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్ చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ల పడుతున్నా బజ్‌బాల్ బ్యాటింగ్‌నే కొనసాగించడం విమర్శలకు దారి తీసింది. కనీసం లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లోనైనా కాస్త తెలివితో ఆడాలని ఇంగ్లండ్‌కు మైఖేల్ వాన్ సూచించాడు.

తొలి టెస్టులో దక్కిన విజయం ఆస్ట్రేలియాకు కచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఆటతీరుపై ఆ జట్టుకు పూర్తి స్పష్టత వచ్చేసి ఉంటుంది. బజ్‌బాల్.. నాకు ఎంతో ఇష్టం. దూకుడు ఆడటానికి నేనేం వ్యతిరేకం కాదు. అయితే అన్నివేళలా అలా ఆడుతానంటే కుదురదు. టెస్ట్‌ల్లో శక్తిని నింపడానికి దూకుడు ఒక్కటే మార్గం కాదు. కొన్నిసార్లు క్లాస్ కూడా చూపించాలని మైఖేల్ వాన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed