స్వీడన్ పోల్ వాల్టర్ సంచలనం.. 10వ సారి వరల్డ్ రికార్డు బద్దలు

by Harish |
స్వీడన్ పోల్ వాల్టర్ సంచలనం.. 10వ సారి వరల్డ్ రికార్డు బద్దలు
X

దిశ, స్పోర్ట్స్ : స్వీడన్ సంచలనం, వాల్ వోల్టర్ మోండో డుప్లాంటిస్ అలవోకగా వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా 10వ సారి అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. పొలాండ్‌లో ఆదివారం జరిగిన సిలేసియా డైమండ్‌ లీగ్‌లో 6.26 మీటర్ల ప్రదర్శనతో కొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో అతను ఆ ఘనత సాధించాడు. అంతేకాకుండా ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో డుప్లాంటిస్ 6.25 మీటర్ల వరల్డ్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్నాడు. తాజాగా ఆ ప్రదర్శనను అధిగమించాడు. మరోవైపు, ఈ టోర్నీలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే అంచనాలను అందుకోలేకపోయాడు. 8 నిమిషాల 29.96 సెకన్లలో రేసును పూర్తి చేసిన అతను 14వ స్థానంతో సరిపెట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌లో అవినాశ్ 8:14.18 సెకన్లతో 11వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed