- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు Kohli ని చూసి షాకయ్యా.. రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న విరాట్ కోహ్లీపై ఆఫ్ఘానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ చాలా గొప్ప క్రికెటర్ అని.. అతడు ఫామ్ కోల్పయాడని నేను అనుకోవడం లేదని తెలిపాడు. అతడిపై ప్రతి మ్యాచ్‌లో భారీ అంచనాలు పెట్టుకోవడంతోనే ఈ తరహా విమర్శలు వస్తున్నాయని చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేయడం ఏ క్రికెటర్‌కు సాధ్యం కాదని.. అలాగే విరాట్ కూడా ప్రతి మ్యా్చ్‌లో పరుగులు చేయాలేడని మద్దతుగా నిలిచాడు.
ఐపీఎల్ - 2022 సందర్భంగా ఓ రోజు కోహ్లీ ఫిట్‌నెస్ చూసి షాకయ్యానని రషీద్ తెలిపాడు. గుజరాత్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి కోహ్లీ ప్రాక్టీస్ చేయడం చూశా.. అతడు నానాస్టాప్‌గా రెండున్నర గంటలపాటు ప్రాక్టీస్ చేశాడని తెలిపాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో విరాట్ 73 పరుగులు చేసి.. ఆర్సీబీకి విజయాన్నందించాడు. ఇక, ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున ఆడినా రషీద్.. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరుఫున బరిలోకి దిగాడు. హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉండటంతో.. ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చినా తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటిల్ ఎగరేసుకుపోయింది.
- Tags
- virat kohli