ఇలా చేయడం అనైతికం, సిగ్గుచేటు: Venkatesh Prasad

by Vinod kumar |
ఇలా చేయడం అనైతికం, సిగ్గుచేటు: Venkatesh Prasad
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 10న కొలంబో వేదికగా భారత్‌, పాక్‌ మధ్య సూపర్‌-4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉన్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 11ను రిజర్వ్‌ డేగా ప్రకటించింది. ఒకవేళ 10న మ్యాచ్‌ మొదలైన తర్వాత వర్షం అంతరాయం కలిగించి ఆటను నిలిపివేస్తే.. ఎన్ని ఓవర్ల వద్ద మ్యాచ్‌ ఆగిపోయిందో మరుసటి రోజు అక్కడి నుంచే మ్యాచ్‌ తిరిగి ప్రారంభమవుందని ఏసీసీ స్పష్టం చేసింది. అయితే సూపర్‌-4లో మరే మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదని పేర్కొంది.

ఈ నిర్ణయంపై భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వెంకటేశ్ ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నిర్వాహకులు రెండు జట్ల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి ఇతర జట్లను అవమానపరిచారు. ఇలా చేయడం అనైతికం, సిగ్గుచేటు. ఇలాంటి ప్రణాళికలు విజయవంతం కావు’’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్విటర్‌‌లో విమర్శించారు. అయితే, భారత్, పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించడంపై శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డులు స్పందించాయి. తమతో సంప్రదింపులు జరిపి మేం అంగీకరించిన తర్వాతే ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించాయి.

Advertisement

Next Story