దేవరను పట్టించుకోని మహేష్ బాబు.. ఆమె సినిమాపై స్పెషల్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-10-11 14:35:38.0  )
దేవరను పట్టించుకోని మహేష్ బాబు.. ఆమె సినిమాపై స్పెషల్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt), వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా(jigra). తమ్ముడి కోసం అక్క చేసే పోరాటంను ఇందులో హైలెట్ చేశారు. ఈ సినిమా నేడు అక్టోబర్ 11న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ ‘జిగ్రా’ (jigra)మూవీకి తెలుగు స్టార్స్ అందరి సపోర్ట్ దక్కింది. రాజమౌళి(Rajamouli), రామ్ చరణ్ (Ram Charan)వంటి వారు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత(Samantha), త్రివిక్రమ్, రానా వంటి వారు వచ్చారు. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu)అలియా భట్ ‘జిగ్రా’(jigra) మూవీపై ట్వీట్ చేశారు. ‘‘ఈ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ ది బెస్ట్ అలియా అండ్ జిగ్రా టీమ్ మొత్తానికి’’ అని రాసుకొచ్చారు.

ప్రజెంట్ సూపర్ స్టార్ వైరల్ కావడంతో తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. ఎన్టీఆర్(NTR), జాన్వీ కాంబోలో వచ్చిన దేవర(Devara) సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని కొరటాల శివ (Koratala Shiva)తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయినప్పటికీ మహేష్ బాబు దేవర(Devara)పై రియాక్ట్ అవకుండా జిగ్రా (jigra).మూవీపై పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంత పెద్ద హిట్ అయినా కూడా దేవర సినిమాపై ఒక్క ట్వీట్ కూడా వేయలేదు ఏంటి బ్రో అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story